దివంగత గోపాలకృష్ణయ్య కాంస్య విగ్రహావిష్కరణ..
1 min read27 డేళ్ల నిస్వార్ధ ప్రజా సేవకు, రాజకీయాలకు మారుపేరు మంచెo గోపాలకృష్ణయ్య..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గం. భీమడోలు మండల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం మాజీ సర్పంచ్ దివంగత మంచెo గోపాలకృష్ణయ్య కాశ్య విగ్రహాన్ని విగ్రహ కమిటీ అధ్యక్షులు ఈతకోట సుబ్బారావు అధ్యక్షతన కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఏర్పాటు చేసి ఆవిష్కరించారు, గోపాల కృష్ణయ్య విడతల వారీగా 27 ఏళ్ల కాలంపాటు1951-1959,1964-1973,1981-1988 సర్పంచ్ గా పనిచేసి గ్రామ అభివృద్ధికి గ్రామస్తుల కష్టసుఖాల్లో పాలుపంచుకొని ఎనలేని మరియు వెలకట్టలేని నిస్వార్థ ప్రజా సేవకుడిగా నిరంతరం ప్రజాలమధ్య ఉంటూ ప్రజా సమస్యలపై కంకణ బద్ధుడై సేవలు అందించి శిఖరాగ్ర కీర్తి గడిచారని ఆయనను వక్తలు కొనియాడారు, విగ్రహాఏర్పాటు కు ఆవిష్కరణకు సహాయ సహకారాలు అందించిన స్థానిక సర్పంచ్ పాము సునీత మాన్ సింగ్ దంపతులను కమిటీ సభ్యులు సన్మానించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భీమడోలు గ్రామపంచాయతీ ఏర్పడి 105 సంవత్సరాల అయిందని అటువంటి గ్రామపంచాయతీలో చిరస్మరణీయుని విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషమని గ్రామ పెద్దలు గుర్తు చేసుకున్నారు, ఆయనకు ఆరుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు మరియు మునుమలు, మనుమరాళ్లు మూడు తరాల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఆయనను స్మరించుకుంటూ గజమాలు వేసి, పూలమాలలు జల్లి ఘనంగా నివాళులు అర్పించారు, కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భీమడోలు సర్కిల్ సీఐ , రిటైర్డ్ డిఎల్పిఓ, విశ్రాంత ఉపాధ్యాయులు మరియు న్యాయవాదులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖ నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై గోపాలకృష్ణయ్యకు నివాళులు అర్పించారు, అనంతరం గ్రామ పెద్దలకు గోపాలకృష్ణయ్య తో అనుబంధం పెన వేసుకున్న సమకాలీలకు గౌరవ సన్మానాలు ఏర్పాటు చేశారు. అనంతరం జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు.