ఉండవల్లిని ఎందుకు కలిశారో చెప్పిన బ్రదర్ అనిల్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను బ్రదర్ అనిల్ కలవటం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు అంటే మంచి చేయటమని… రాజకీయ జ్ఞానం తెలుసుకునేందుకు ఉండవల్లిని కలిసినట్లు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ అన్నారు. అనిల్ మీడియాతో మాట్లాడుతూ ‘‘మా సీక్రెట్‌లు మాకు ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి’’ అని తెలిపారు. హిందూ మతోన్మాదం ఈ మధ్య పెరిగిందన్నారు. తాను ఏసుప్రభుని నమ్ముకున్నానని, దేవుడు చెప్పకుండా ఏ పని చేయనని అనిల్ పేర్కొన్నారు.