అన్నయ్య మాట తమ్ముళ్ల మనసు గెలిచింది
1 min read
పల్లెవెలుగువెబ్: ‘‘మేమిద్దరం చెరో వైపు ఉండటం కంటే.. నేను తప్పుకోవడమే నా తమ్ముడు మరింతగా ఉద్భవించడానికి ఉపయోగకరం అవుతుందేమోననే రాజకీయాల నుండి తప్పుకున్నాను..’’ అని చిరంజీవి ఉన్నతత్వంతో చెప్పిన మాట కోట్లాది మంది తమ్ముళ్ళ మనసులు గెలుచుకుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు అన్నారు. దీనిపై జనసేన పార్టీ తరపున ఓ లేఖను ఆయన విడుదల చేశారు. తన సోదరులైన చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల విషయంలో ఎవరైనా ఏదైనా అంటే.. సోషల్ మీడియా వేదికగా నాగబాబు ఏ విధంగా స్పందిస్తుంటారో తెలిసిన విషయమే.