బీఆర్ఎస్ కుట్ర బహిర్గతం చేస్తాం
1 min readపల్లెవెలుగువెబ్: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ విఫల ప్రయోగమని, ఇందులోని డొల్లతనాన్ని ఢిల్లీ స్థాయిలో బయటపెడతామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్, ఢిల్లీలలో సదస్సులు పెట్టి బీఆర్ఎస్, కేసీఆర్ కుట్రలను బహిర్గతం చేస్తామని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.