బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో అద్భుతం
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజల సంక్షేమ ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు గడపగడపకు అందిస్తుంది. టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది. రైతుబంధు పథకం కింద విడుతలవారీగా ఎకరానికి 16వేలు పెంచటం, రేషన్ కార్డుదారులకు ఐదు లక్షల బీమా, సన్న బియ్యం, పింఛన్ల పెంపు, రూ.400 కి సిలిండర్ ఇలాంటివి అద్భుతంగా మ్యానిఫెస్టో ఉన్నాయని సర్వత్ర ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో తో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావడం ఖాయం. అదేవిధంగా వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి ఏజెండా గా పనిచేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మంత్రి చేసిన అభివృద్దే నియోజకవర్గం ప్రజలు పట్టం కడతారు.