పాక్ డ్రోన్ల పై బీఎస్ఎఫ్ కాల్పులు !
1 min readపల్లెవెలుగువెబ్ : పాక్ డ్రోన్‌పై గురువారం బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. జమ్మూకశ్మీరులోని అర్నియా సరిహద్దుల్లో గురువారం తెల్లవారుజామున 4.15గంటలకు అనుమానాస్పద పాకిస్థాన్ డ్రోన్ కదలికలను సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ 300 మీటర్ల ఎత్తులో ఉండగా బీఎస్ఎఫ్ జవాన్లు పలు రౌండ్ల కాల్పులు జరిపారు. ఎగురుతున్న డ్రోన్ నుంచి మెరిసే కాంతి బీఎస్ఎఫ్ జవాన్లు గమనించారు. పాక్ అనుమానిత డ్రోన్ నుంచి ఏవైనా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కిందకు జారవిడిచారనే అనుమానంతో బీఎస్ఎఫ్ జవాన్లు శోధన ప్రారంభించారు. జమ్మూ, కథువా, సాంబా సెక్టార్లలో ఈ మధ్య కాలంలో భద్రతా బలగాలు పలు డ్రోన్లను కూల్చివేశాయి.