బీటెక్, బీఈడీ.. టీచర్ పోస్టుకు అర్హులే
1 min readపల్లెవెలుగువెబ్ : బీటెక్, బీఈడీ విద్యార్హత కలిగి ఉన్న విద్యార్థులు టీచర్ పోస్టులకు అర్హులేనని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. బీటెక్ అభ్యర్థులనూ ఈ పోస్టులకు అనుమతించాలంటూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.