PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బుడ్డా…నీలా పారిపోయే రకం కాదు… : ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి

1 min read

తెలుగు గంగ కాలువలో నీటిమట్టం తగ్గితే… అభివృద్ధి పనులు షురూ…

పల్లెవెలుగు వెబ్​, మహానంది: శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఫైర్ అయ్యారు .నీ మాద్రి పారిపోయే రకం కాదని తాను రైతుల పక్షాన మరియు ప్రజల పక్షాన నిలబడి తత్వమే ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి మహానందిలో పేర్కొన్నారు .శనివారం మహానంది లో జరుగుతున్న అభివృద్ధి పనుల పై పరిశీలించడానికి  వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి తనపై బండల వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు . మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి రాజకీయ వ్యాపారం చేస్తున్నారని ప్రజలు గమనించాలని శిల్ప అన్నారు. తనకు చదువు రాకున్నా సంస్కృతి సంస్కారం తెలుసునని చదువుకున్న ఆయనకు ఇవి లేవనిఉంటే అలా మాట్లాడాలని   అని ఎద్దేవా చేశారు. ఎల్ వన్ మరియు ఆర్ వన్ కాలువలకు ప్రస్తుతం నవంబర్, డిసెంబర్ మాసంలో రైతులు  వేసిన పంటలు బయటపడేందుకు  దాదాపు  ఫిబ్రవరి మాసం చివరి వరకు సాగునీరు అందించాలని ఇన్ఛార్జి మంత్రితో పాటు కలెక్టర్ ను కోరడం జరిగిందన్నారు. అందుకు స్పందించిన మంత్రి మరియు కలెక్టర్ ఫిబ్రవరి మాసం వరకు సాగునీరు  అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. కెసి కెనాల్ కింద వేసిన పంటలు పరిరక్షించడానికి మార్చి నెల 31 తేదీ వరకు సాగునీరు అందించడానికి మంత్రి మరియు కలెక్టర్ ,నీటి పారుదల శాఖ అధికారులు పచ్చజెండా ఊపినట్లు తెలిపారు .

మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గతంలో ఏం చెప్పారు ఏం చేశారో ప్రజలు మరియు రైతులు  గమనిస్తున్నారని తాను చెప్పిందే చేస్తానని చేయనిది చెప్పలేనని శిల్పా అన్నారు  . తెలుగు గంగ ప్రధాన కాలువ లైనింగ్ పనులు పూర్తి చేయాలని తెలుగు గంగ రిజర్వాయర్ లో నీటి మట్టం తగ్గితే తప్ప చేయలేమని జలవనరుల శాఖ చెప్తుందని ఇది దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేగా రైతులకు న్యాయం చేయడంతోపాటు లైనింగ్ పనులు పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు కల్లబొల్లి మాటలు నమ్మవద్దని నవంబర్ డిసెంబర్ మాసంలో వేసిన పంటలు చేతికి అందేలా తన శాయశక్తులా కృషి చేస్తానని,  ప్రస్తుతం  వేసే పంటలు హామీ ఇవ్వలేమని ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు.

‘మహానందిలో నూతన పాలక మండలి’

మహానంది క్షేత్రానికి సంబంధించి సంక్రాంతి అనంతరం నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం చేస్తుందని ఇప్పటికే పాలకమండలి సభ్యుల పేర్లు మరియు వివరాలు అధికారికంగా విడుదల అయ్యాయి అని తెలిపారు.తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మహానంది దేవస్థానానికి ఒక కోటి 60 లక్షల రూపాయలు నిధులు విడుదల అయ్యాయని మామూలుగా  అయితే నాలుగుకోట్ల 20  లక్ష రూపాయలు నిధులు విడుదల కావాల్సి ఉందన్నారు .పాలకమండలి ఏర్పడిన తర్వాత ఈ నిధులను ఎక్కడ వినియోగించే అవకాశముందో చూసి అక్కడ  వినియోగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆయన వెంట మహా దేవస్థానం మాజీ చైర్మన్​ భూపాల్ రెడ్డి గంగిశెట్టి మల్లికార్జున బుక్కాపురం రఘు తమ్ముడు పల్లెపాల మహేశ్వర్ రెడ్డి ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

About Author