NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మచ్చలేని నాయకుడు బుడ్డా రాజన్న

1 min read

– పస్పిల్ మున్నా( తెలుగు యువత ప్రధాన కార్యదర్శి)
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: తెలుగుయువత నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గా తనను నియమించి ఒక సంవత్సరం పూర్తి అయ్యిందని నాకు ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీశైలం మాజీ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా జూన్ నెల చివర్లో శ్రీశైలం నియోజకవర్గ మహిళల కోసం ఉచిత కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ, బుట్టల అల్లికలు శిక్షణ శిబిరాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నమ్ముకున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకొనే గొప్ప మనసున్న నాయకుడు బుడ్డా రాజన్న అని కొనియాడారు. త్వరలో శ్రీశైలం నియోజకవర్గ చదువుకొని ఉద్యోగాలు లేని యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

About Author