ప్రజల సంక్షేమమే బుడ్డా లక్ష్యం : రామమూర్తి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: శ్రీశైలం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం తాపత్రయపడే ఏకైక నాయకుడు బుడ్డా రాజశేఖరరెడ్డి అని టీడీపీ నాయకులు రామమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సహకారంతో ఆత్మకూర్ పట్టణంలోని ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ కార్యాలయం ప్రాంగణంలో ఆత్మకూర్ పట్టణ ప్రజలకోసం చర్మ వ్యాధుల నిపుణుల చే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆత్మకూర్ పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీద ప్రజల కోసం బుడ్డా రాజశేఖరరెడ్డి చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చెయ్యడం కేవలం బుడ్డా కుటుంబానికే సాధ్యమని హర్షం వ్యక్తం చేశారు, శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధి కేవలం బుడ్డా రాజశేఖరరెడ్డి కే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా యూత్ లీడర్ ఫారూఖ్, 22 వ వార్డ్ అధ్యక్షుడు కార్పెంటర్ బాషా, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి రేణుకాప్రసాద్, పాన్ మహమ్మద్,అబ్దుల్ హుస్సేన్, రబ్బానీ, శాంతిరామ్ హాస్పిటల్స్ చర్మవ్యాది నిపుణులు డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ పూజిత, సిబ్బంది వరప్రసాద్ గారు,మనోజ్,నాయక్, ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జునైద్ బాషా పాల్గొన్నారు.