NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిగురించిన ఆశలు… మండలంలో కొనసాగుతున్న వర్షం

1 min read

– రైతుల కళ్ళల్లో ఆనందం….

పల్లెవెలుగు వెబ్ గడివేముల : మండలంలో మంగళవారం మధ్యాహ్నం నుండి వర్షం కొనసాగుతుండడంతో రైతుల ఆశలు చిగురించాయి వర్ష భావం వల్ల పొలాలు సేద్యం చేసుకుని విత్తనాలు నాటి పెట్టుకున్న రైతులు గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వేసిన విత్తనాలు మొలకెత్తుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఖరీఫ్ సీజన్లో గత నెల నుండి ఇదే రెండో వర్షం మోస్తారుగా కురవడం ముందస్తుగా వేసిన పత్తి కి జీవం పోసినట్టయింది.   మండలంలో ఖరీఫ్ సీజన్ కింద దాదాపు 20 వేల ఎకరాలు సాగు చేస్తారు. అయితే జూన్ ఆఖరి వారం వచ్చిన9వేలఎకరాల్లోవిత్తులువేసినట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. ప్రధాన పంట కింద పత్తి మొక్కజొన్న సోయాబీన్ కందులు మినుములు పేసులు వేస్తారు. ఖరీఫ్ సీజన్ కు వ్యవసాయ శాఖ దాదాపు మండల వ్యాప్తంగా ఆర్ బి కే సెంటర్లలో డీఏపీ యూరియా కాంప్లెక్స్ ఎరువులు, సిద్ధంగా ఉంచినట్టు మండల వ్యవసాయ అధికారి హేమసుందర్ రెడ్డి తెలిపారు 100% సబ్సిడీ కింద ఇప్పటికే జీలుగలు కందులు మిని కీట్స పంపిణీ చేసినట్టు తెలిపారు మేఘాలు ఆవరించిన వర్షం లేకపోవడంతో మండలంలో వింత వాతావరణ నెలకొంది గత సంవత్సరం జూన్‌ 9న జిల్లాలో నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి.   మండలంలో పత్తి మినుము సోయా మిరప మొక్కజొన్న అధికంగా సాగు చేస్తున్నారు నంద్యాల జిల్లాకు మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో పొలాలు పదునెక్కి పంటలకు జీవం పోసినట్టయింది పంటలకు ఊపిరి నిలిపిన వాన దేవుని రైతులు ధన్యవాదాలు తెలిపారు.

About Author