బడ్జెట్ బూస్ట్.. లాభాల్లో సూచీలు
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల ధోరణిలో సూచీలు కదులుతున్నాయి. బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రసంగం చేశారు. లాంగ్ టర్మ క్యాపిటల్ గెయిన్స్ 15 శాతానికి పరిమితం చేస్తున్నట్టు ప్రకటించారు. క్రిప్టో కరెన్సీ పై 30 శాతం పన్ను విధించనున్నట్టు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సెన్సెక్స్ 846 పాయింట్ల లాభంతో 58860 వద్ద, నిఫ్టీ 232 పాయింట్ల లాభంతో 17572 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.