NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తొలిసారిగా ఉభయ సభలకు గవర్నర్ హాజరయ్యారు. ఇప్పటి వరకు రెండుసార్లు వర్చువల్‌గా మాత్రమే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. మరోవైపు గవర్నర్ ప్రసంగంలో ఏయే అంశాలు ప్రస్తావిస్తారో అనే ఆసక్తి నెలకొంది. అభివృద్ధి వికేంద్రీకరణపై గవర్నర్ ప్రసంగంలో కీలక ప్రస్తావన ఉండే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది.

                                   

About Author