బుగ్గ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు
1 min read– జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్
పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: మహా పుణ్యక్షేత్రమైన కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు.శుక్రవారం కాలుబుగ్గలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు.ముందుగా ఆలయ అర్చకులు ఎస్పీకి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ పాలక మండలి సభ్యులకు తెలిపారు.సచివాలయ మహిళా పోలీసులతో సహా మొత్తం 100 మంది పోలీసు సిబ్బందితో జిల్లా పోలీసుయంత్రాంగం అన్ని రకాల ముందస్తు పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. కోనేరు, క్యూ లైన్లు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్ల బారీకేడ్లు, పార్కింగ్ స్ధలాలు, పోలీసు కంట్రోల్ రూమ్ ల ఏర్పాట్ల ను కూడా పరీశీలించామన్నారు. సిసి కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉంచామన్నారు. భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా , ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.భక్తులతో వెళ్ళే వాహనాలు ఓవర్ లోడ్ తో వెళ్ళకుండా, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారుసమస్యలున్నచోట సిబ్బంది సత్వరమే స్పందించాలన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్, కర్నూలు రూరల్ సిఐ శ్రీనివాస రెడ్డి, ఓర్వకల్లు ఎస్సై మల్లికార్జున, ఆలయ కమిటి ఈఓ ప్రసాద్ , చైర్మన్ చెన్నారెడ్డి పాల్గొన్నారు.