‘బుగ్గన’ అప్పుల మంత్రిగా కనిపిస్తున్నారు : జీవీఎల్
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిన సంగతి దేశం మొత్తం తెలిసిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. కొత్త అప్పు కోసం రాష్ట్రం రోజూ ప్రయత్నించే పరిస్థితి ఉందని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి చెందిన పలు విషయాలు కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఏపీలో అప్పుల కోసమే ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు ఉందని, అది రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించేదిగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏపీఎస్డిసీకి సవరణలు చేయాలని కోరారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుల మంత్రిగా కనిపిస్తున్నారని, రోజూ కొత్త అప్పుల కోసం పడరానిపాట్లు పడుతున్నారని అన్నారు. ఏపీ అప్పులపై కాగ్ ఆడిట్ నిర్వహించాలని కేంద్రాన్ని కోరుతానని జీవీఎల్ చెప్పారు.