విద్యార్థులు మంచి భవిష్యత్తును నిర్మించుకోండి
1 min readపల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: విద్యార్థులు క్రమశిక్షణతో చదువులు కొనసాగించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని శ్రీ నంది కళాశాల ప్రిన్సిపల్ బత్తుల శ్రీకాంత్ అన్నారు. కర్నూలు మరియు నంద్యాల జిల్లాల అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణా తరగతులు స్థానిక వాసవి కళ్యాణమండపంలో ప్రారంభమయ్యాయి. శనివారం నంద్యాల జిల్లా ప్రాముఖ్ అన్నెం పార్థసారథి రెడ్డిఅధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హాజరైన అతిధులు శ్రీ నంది కళాశాల ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్, ఏబీవీపీ సంఘటన కార్యదర్శి శివ కుమార్ , విభాగ్ కన్వీనర్ మహేష్ కుమార్ , కళామంచి కన్వీనర్ నాగరాజు లు సంయుక్తంగా జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమం ను ప్రారంభించటం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ నంది కళాశాల ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ తో జీవిస్తే మంచి భవిష్యత్తు ను నిర్మిచుకోవచ్చన్నారు. ముఖ్య వక్త గా విచ్చేసిన ప్రాంత సంఘటన కార్యదర్శి చిరిగే శివకుమార్ మాట్లా ఏబీవీపీ నిరంతరం విద్యార్థుల సమస్యల పరిస్కారం కోసం పనిచేయడమే కాకుండా వారిలో వివిధ కార్యక్రమాల ద్వారా దేశ భక్తి నీ పెంపొందించడానికి కృషిచేస్తోందన్నారు. విభగ్ కన్వీనర్ మహేష్ ,కళామంచ్ కన్వీనర్ నాగరాజు ఎస్ ఎఫ్ డి కన్వీనర్ భాను ప్రకాష్ రెడ్డి ,కర్నూల్, నంద్యాల జిల్లాల కన్వీనర్ లు మారుతి, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.