కుప్పంలో ఇల్లు కడతా.. వేరు చేసే శక్తి ఎవరికీ లేదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : తాను ఎప్పటికీ కుప్పానికి చెందిన వాడేనని స్పష్టంచేశారు. తనను కుప్పం నుంచి వేరు చేసే శక్తి ఎవరికీ లేదన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు, వైసీపీ అరాచకపాలనతో అంధకారం నెలకొందన్నారు. ప్రజలపై విద్యుత్, బస్‌చార్జీల పెంపు, పెట్రోఉత్పత్తుల భారం మోపారన్నారు. మోపి ప్రజలకు గుద్దుల రుచి చూపిస్తున్నారన్నారు. ‘నేను స్థానికుడినే. కుప్పంలో ఇల్లు కడతాను. దానికోసం రెండెకరాలు స్థలం కొన్నా. త్వరలోనే ఇంటినిర్మాణం చేపడతా’నని చంద్రబాబునాయుడు చెప్పారు. తనకు గట్టి నాయకులు కావాలే తప్ప, వట్టినాయకలు అవసరం లేదన్నారు. కష్టకాలంలో పార్టీకి పనిచేయని వారిని మార్చేందుకూ వెనకాడేది లేదన్నారు. అధికార పార్టీ ఆగడాలు, ఒత్తిళ్లకు బెదరకుండా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న యువ కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటానని, భవిష్యత్‌లో వారికి తగు గుర్తింపునిస్తానని చెప్పారు.