‘జగనన్న కాలనీ’ లో ఇళ్లను త్వరగా నిర్మించండి
1 min read– విద్యుత్ కనెక్షన్, లే అవుట్ పనులు పూర్తి చేయండి
– ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు
పల్లెవెలుగువెబ్, చిట్వేల్: రాష్ట్రంలో ప్రతి పేదవాడికి గూడు ఉండాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ వైఎస్సార్జగనన్న కాలనీ’పేరిట ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు కోరారు. చిట్వేల్ పట్టణ పేదలకు హరిజన వాడ వద్ద వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. బుధవారం హరిజనవాడ వద్ద నున్న జగనన్న కాలనీ హౌసింగ్ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. కాలనీలో ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని అధికారులును ఆదేశించారు. ఈ లే అవుట్ 200 మంది కి ప్లాట్స్ ఇవ్వడం జరిగిందని, సిసి రోడ్డు, త్రాగునీటి వసతులు కల్పన, భూగర్భ డ్రైనేజీ , రహదారుల నిర్మాణాలకు, చేపట్టాలన్నారు. లే అవుట్ లో అధిక సంఖ్యలో మొక్కలు నాటేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ డిఈ, మహేష్ రెడ్డి , ధ్వజ రెడ్డి , కిషోర్ రెడ్డి, నరసింహ, మండల నాయకులు పాల్గొన్నారు.