భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి..
1 min read– శాఖల ఇంజనీర్లకు దిశ నిర్దేశం..
– జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరములో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ముఖ్య అతిధిగా పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ప్రాధాన్యత భవనాల నిర్మాణ పురోగతిపై ప్రధాన చర్చ జరిగినది. ఈ సమావేశంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు మరియు YSR హెల్త్ క్లీనిక్ భవన నిర్మాణాలు అక్టోబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలని చైర్ పర్సన్ ఇంజనీర్లకు దిశ నిర్దేశం చేశారు. సదరు భవనాల నిర్మాణము కొరకు ప్రభుత్వం అదనముగా నిధులు కేటాయించిందని అవి కూడా సరిపోని చోట జిల్లా పరిషత్ నందు లభ్యత గల నిధుల నుండి మంజూరు చేస్తామని తెలియజేసారు. చైర్ పర్సన్ వారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇంజనీరింగ్ డివిజన్లో అత్యధికముగా భవనములు పూర్తి చేసిన మండల ఇంజరింగ్ అధికారులకు దుస్సాలువతో సన్మానించి ప్రశంసాపత్రం అందజేసారు. ఇంజనీర్లు ఈ సమాజానికి పునాదులు లాంటి వారు అని గ్రామాలలో మౌలిక సదుపాయాల రూప కల్పనలో మీ పాత్ర అజరామరం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ పర్యవేక్షక ఇంజనీరు ఏలూరు సర్కిల్, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఏలూరు, రాజమహేంద్రవరం, భీమవరం, పంచాయితీరాజ్ EE ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అందరు మండల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.