బుల్ జోరుకు బ్రేక్
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ఆరంభమై అదే బాటలో ముందుకు సాగాయి. సోమవారం భారీ లాభాలు సాధించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఐరోపా మార్కెట్లు, యూఎస్ ఫ్యూచర్లు నెగిటివ్ గా కదులుతున్నాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్ 435 పాయింట్ల నష్టంతో 60176 వద్ద, నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో 17,957 వద్ద ముగిశాయి.