NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్యాగ్ లో బుల్లెట్.. పోలీసుల ఎదుట ప‌రిటాల సిద్దార్థ్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి ప‌రిటాల సునీత‌ ర‌వీంద్ర చిన్న కుమారుడు ప‌రిటాల సిద్ధార్థ్ పోలీసుల ఎదుట హాజ‌ర‌య్యారు. రెండు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప‌రిటాల సిద్ధార్థ్ బ్యాగ్ లో తుపాకీ బుల్లెట్ ల‌భ్యమైంది. దీంతో పోలీసులు సిద్ధార్థ్ కు నోటీసు జారీ చేశారు. ఇవాళ శంషాబాద్ ఏసీపీ ఎదుట సిద్ధార్థ్ హాజ‌ర‌య్యారు. సిద్ధార్థ గ‌తంలో పాయింట్ 32 క్యాలిబ‌ర్ గ‌న్ కు లైసెన్స్ పొందినట్టు తెలుస్తోంది. సిద్ధార్థ్ బ్యాగ్ లో సాయుధ ద‌ళాలు ఉపయోగించే 5.56 క్యాలిబ‌ర్ బుల్లెట్ ల‌భించిన‌ట్టు స‌మాచారం. రెండ్రోజుల క్రితం స్నేహితుల‌తో క‌లిసి ప్రయాణం నిమిత్తం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సిద్ధార్థ్ చేరుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది త‌నిఖీల్లో భాగంగా అత‌ని బ్యాగ్ లో బెల్లెట్ బ‌య‌ట‌ప‌డింది.

About Author