పల్లెవెలుగువెబ్ : ఇటలీకి చెందిన ఓ కంపెనీ అధునాతన స్మార్ట్ ఫోన్ అభివృద్ధి చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. బుల్లెట్ తగిలినా చెక్కు చెదరదు. సాధారణంగా బుల్లెట్ దెబ్బకు స్మార్ట్ ఫోన్లు తునాతునకలవుతాయి. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ కంపెనీ ‘కేవియర్’ స్టీల్త్ ఐఫోన్ పేరుతో సిరీస్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తోంది. కిందటి ఏడాది ఐఫోన్ 12లో లగ్జరీ మోడల్‌ను తీసుకొచ్చిన కేవియర్.. ఇప్పుడు దానికి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా స్టీల్త్ 2.0 ఐఫోన్ 13 సిరీస్‌ను తీసుకొచ్చింది. స్టీల్త్ వెర్షన్ 2.0 ఐఫోన్లు.. బీఆర్-2 క్లాస్2కి చెందిన బుల్లెట్‌ప్రూఫ్ కవచంతో తయారు చేయించింది. బుల్లెట్‌ప్రూఫ్ కవచాలతో ఆయుధ వాహనాల్ని, యుద్ధ విమానాల్ని రూపొందించే ఎన్‌పీవో టీసీఐటీ సహకారంతో కేవియర్ ఈ ఐఫోన్‌ను పైప్యానెల్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.