PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బంప‌ర్ ఆఫ‌ర్.. 70 శాతం డిస్కౌంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈకామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు పోటీ పడి వినియోగదారులకు డిస్కౌంట్‌లు ప్రకటించాయి. దీంతో పాటు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నాయి. అమెజాన్‌ ఆగస్ట్‌ 6న నుంచి గ్రేట్‌ ఫ్రీడం ఫెస్టివల్‌ సేల్‌ను నిర్వహిస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్‌ ఆగస్ట్‌ 6 నుంచి ఆగస్ట్‌ 10 వరకు బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈసేల్‌లో శాంసంగ్‌, రియల్‌మీ, షావోమీతో పాటు ఇతర సంస్థలకు చెందిన టీవీలపై టెలివిజన్‌, హోం అప్లయన్సెస్‌పై 75శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు చెప్పింది.

                                      

About Author