నగర ప్రజలకు బంపర్ ఆఫర్..
1 min read
పన్నులో 5 శాతం రాయితీ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు నగర ప్రజలు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీ లోపు ముందస్తుగా ఒకేసారి చెల్లించి ఐదు శాతం రాయితీ పొందవచ్చని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు నగర పాలక కార్యాలయంలోని పన్ను చెల్లింపు కౌంటర్లలోనే కాకుండా ఆన్ లైన్ లో www.cdma.ap.gov.in ద్వారా కూడా చెల్లించి రాయితీ పొందవచ్చని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఈ నెల 30వ తేదీ వరకు నగర పాలక కార్యాలయంలోని పన్ను చెల్లింపు కౌంటర్లు సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయని ఆయన తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ టాక్స్ చెల్లించి, రాయితీ పొందాలని, నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు.