వంట మాస్టర్లు, యోగాగురువులకు బంపర్ ఆఫర్ !
1 min readపల్లెవెలుగువెబ్ : యోగా గురువులు, చెఫ్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు రంగాలకు చెందిన వారిని ప్రత్యేకంగా పరిగణిస్తూ వీసాలు జారీ చేస్తామని తెలిపింది. ఇప్పటి వరకు వంట మాస్టర్లు, యోగా గురువులు స్కిల్క్‌డ్ పర్సన్స్ కోటాలోనే ఆస్ట్రేలియా వీసాలు జారీ చేస్తోంది. దీని వల్ల వీసాలు పొందడానికి చాలా ఆలస్యం జరుగుతూ వస్తోంది. ఇటీవల భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆస్ట్రేలియా ఇండియా ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. అందులో భాగంగా యోగా గురువులు, చెఫ్‌లకు ప్రత్యేక వీసాలు జారీ చేస్తామని ఆస్ట్రేలియా టూరిజం మినిష్టర్ డాన్ తెహాన్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య రాకపోకలు పెరిగినప్పుడే ఏఐఈసీటీఏ ప్రయోజనాలు నెరవేరుతాయని ఆయన తెలిపారు.