PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫర్.. ఎన్ని సెల‌వులైనా తీసుకోవ‌చ్చు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అట్రిషన్‌, గ్రేట్‌ రిజిగ్నేషన్‌ సమస్యలు ఐటీ కంపెనీలను పట్టి పీడిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో న్యూజిల్యాండ్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ‘యాక్షన్‌ స్టెప్‌’ ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కార మార్గంగా కొత్త వర్క్‌ కల్చర్‌ను తెరపైకి తెచ్చింది. ఇప్పటి వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ను ఆయా సంస్థలు అమలు చేస్తుండగా.. యాక్షన్‌ స్టెప్‌ ‘హైట్రస్ట్‌ మోడల్‌’ వర్క్‌ కల్చర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త వర్క్‌ మోడల్‌ ద్వారా ఉద్యోగులు సంవత్సరంలో ఎన్ని సెలవులు కావాలంటే అన్ని తీసుకోవచ్చని’ ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ స్టీవ్‌ మేహ్యూ అన్నారు.

                                

About Author