సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్
1 min readపల్లెవెలుగువెబ్ : సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల పై ప్రత్యేక వడ్డీ రేటు అందించాలని, పోస్టల్ సేవింగ్స్ పథకం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పెట్టుబడులపై పరిమితిని తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ ను శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కోరారు. తారామన్‌కు చతుర్వేది ఈ మేరకు లేఖ రాశారు. పొదుపు పథకాలపై తక్కువ వడ్డీరేట్లు సీనియర్ సిటిజన్లకు తక్కువ రిటైర్‌మెంట్ నిధులను మిగిల్చాయని, ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి కాలంలో వారిపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించాయని పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వడ్డీరేట్లు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఎఫ్‌డీలపై వడ్డీ 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిందన్నారు. పోస్టాఫీసుల పొదుపు ఖాతాల్లో పెట్టుబడు లపై రూ.15 లక్షల పరిమితి వరకు వడ్డీ దాదాపు ఏడు శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. పీపీఎఫ్ విషయానికి వస్తే వార్షికంగా కేవలం రూ.1.5 లక్షల పరిమితి ఉందని, పీపీఎఫ్ మినహా ఇవన్నీ పన్ను పరిధిలోకి వస్తాయని గుర్తు చేశారు. వడ్డీరేట్లను తగ్గించడం వల్ల సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు తమ కుటుంబాలను నడిపేందుకు తగినంత ఆదాయం పొందడం కష్టతరంగా మారిందని పేర్కొన్నారు.