ఆ కోర్సులు చేసిన వారికి బంపర్ ఆఫర్లు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులకు భారీ ఆఫర్లు వచ్చాయి. ఉద్యోగాలు ఇచ్చేందుకు 270 కంపెనీలు పోటీ పడ్డాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పీజీపీ విద్యార్థులు మొత్తం 2,066 ఆఫర్ లెటర్లు అందుకున్నారు. ఐఎస్బీ చరిత్రలో ఇప్పటివరకిదే అత్యధికం. అంతేకాదు, కంపెనీలు ఆఫర్ చేసిన వార్షిక సగటు వేతనం కూడా సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.34.07 లక్షలకు పెరిగింది. గత ఏడాది సగటు రూ.28.21 లక్షలతో పోలిస్తే 20.78 శాతం అధికం. మొత్తం ఆఫర్ లెటర్ల ప్రకారంగా ఒక్కో విద్యార్థికి సగటున రెండుకు పైగా ఉద్యోగావకాశాలు లభించినట్లయింది