బప్పి లహరి ఇకలేరు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూశారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 69 ఏళ్లు. 1952 నవంబర్ 27న బెంగాల్‌లో జన్మించిన బప్పి.. తెలుగులో సింహాసనం, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు.