PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుటుంబ పెద్ద లేక పిల్లల పోషణ భారం

1 min read

– ప్రేమ కథ (పాకిస్తానీ) చిత్రం.. ఆర్థిక కష్టాల్లో కుటుంబ పోషణ చేసుకోలేని పరిస్థితుల్లో కుటుంబం…
పల్లెవెలుగు వెబ్ గడివేముల: అక్రమంగా దేశంలోకి చొరబడిన పాకిస్థాన్‌ పౌరుడు.. తొమ్మిదేళ్లు ఆమెతో సహజీవనం చేసి, నలుగురు పిల్లలను కని సొంత దేశం పై ప్రేమతో కుటుంబ సభ్యులను కలిసి పాకిస్తాన్లో స్థిరపడాలనే ఆకాంక్షతో కుటుంబంతో వెళుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డాడు. అనంతరం మూడు నెలలు విచారణ నిమిత్తం జైల్లో ఉన్న అతను బెయిల్ పై విడుదలై. అధికారుల హెచ్చరికతో పాకిస్తాన్ కి ఫోన్ చేయొద్దు అన్న 2022 జనవరి మధ్యలో పాకిస్తాన్ కి కాల్ చేసి మళ్లీ కటకటాల పాలయ్యాడు కుటుంబ పెద్ద లేక పిల్లల పోషణ భారం మోయలేక దాతలు ఆదుకోవాలని కుటుంబానికి న్యాయం చేయాలని మహిళ దీనంగా అర్థిస్తోంది. గడివేములకు చెందిన షేక్‌ దౌలత్‌బీకి పెళ్లయిన ఏడేళ్ల తర్వాత భర్త చనిపోయాడు. అప్పటికే వారికి ఓ కుమారుడున్నాడు. భర్త మరణించాక దౌలత్‌బీ తల్లిదండ్రుల వద్దకు చేరింది. 2010లో ఆమె ఫోన్‌కు ఓ కాల్‌ వచ్చింది. అలా పాకిస్థాన్‌ పౌరుడైన గుల్జార్‌ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. అక్కడి పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన గుల్జార్‌ సౌదీ అరేబియాలో పెయింటర్‌గా పనిచేసేవాడు. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. దౌలత్‌బీని కలిసేందుకని గుల్జార్‌ఖాన్‌ సౌదీ నుంచి ముంబయి మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. నేరుగా గడివేములకు వచ్చి 2011 జనవరి 25న దౌలత్‌బీతో నిఖా చేసుకున్నాడు. వారికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం కలిగారు. తొమ్మిదేళ్ల పాటు సంసారం సాఫీగానే సాగింది. గుల్జార్‌ గడివేములలో ఆధార్‌కార్డు పొందాడు. దాని ఆధారంగా తనతో పాటు భార్య, ఐదుగురు పిల్లలను సౌదీ అరేబియాకు తీసుకెళ్లేందుకు వీసాలు తీసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్థాన్‌ వెళ్లాలన్నది వారి ప్రణాళిక. 2019లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాగా, తనిఖీ సిబ్బంది పరిశీలనలో గుల్జార్‌ఖాన్‌ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అరెస్టు చేసి జైలుకు తరలించారు.అలా ఎయిర్‌పోర్టులో భర్త దూరమై.. పిల్లలతో సహా స్వస్థలానికి తిరిగొచ్చిన దౌలత్‌బీ సంసారం నెట్టుకురాలేక సతమతమవుతోంది. తన ఐదుగురు సంతానంతో పాటు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న సోదరి పోషణ భారం ఆమెపైనే పడింది. ఇళ్లల్లో పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు మహమ్మద్‌ ఇలియాస్‌ కూలీ పనులకు వెళ్తుండగా, మిగిలిన వారంతా పదేళ్లలోపు చిన్నారులే. గుల్జార్‌ఖాన్‌ అరెస్టయిన ఆరు నెలల తర్వాత కరోనా కారణంగా జైలు నుంచి విడుదలయ్యాడు. ఏడాది పాటు భార్య పిల్లలతో కలిసున్నాడు. 2022లో మళ్లీ హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు అధికారులు తరలించారు. ఆమె తన భర్తను విడుదల చేయాలని అధికారులు, లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు.

About Author