PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చాతీలో మంట‌.. పొట్ట ఉబ్బరం .. త్రేన్పుల స‌మ‌స్యల నుంచి ఇలా బ‌య‌ట‌ప‌డండి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : చాతీలో మంట‌, పొట్ట ఉబ్బరం, త్రేన్పుల స‌మ‌స్యల‌తో చాలా మంది ఇబ్బందిప‌డుతారు. స‌రైన జీవ‌న విధానం అలవాటు చేసుకోక‌పోతే ఈ స‌మ‌స్యలు అంత త్వర‌గా త‌గ్గవు. యాసిడ్ రిఫ్లక్స్ వ‌ల్ల ఈ స‌మ‌స్యలు ఏర్పడుతాయి. ఎత్తుకు త‌గిన బ‌రువు ఉండేలా చూసుకోవాలి. అధిక బ‌రువు ఉంటే త‌గ్గించుకోవాలి. ఆహారం తింటున్న స‌మ‌యంలో అన్నవాహిక‌కు దిగువున ఉన్న క‌వాటం తెరుచుకుంటుది. ఆహారం లోప‌లికి వెళ్లిన త‌ర్వాత క‌వాటం మూసుకుంటుంది. జీర్ణాశ‌యం పై ఒత్తిడి ఎక్కువ ప‌డిన‌ప్పుడు యాసిడ్స్ క‌వాటం తోసుకుని పైకి వ‌స్తాయి. దీని వ‌ల్ల చాతీలో మంట వ‌స్తుంది.

ఈ స‌మ‌స్యను అధిగ‌మించాలంటే రోజూ అర‌గంట పాటు వ్యాయామం చేయాలి. క్రమంత‌ప్పకుండా శారీర‌క వ్యాయామం చేసేవారిలో ఈ స‌మ‌స్య త‌క్కువ‌గా ఉంటుంది. రెండు క‌ప్పుల క‌న్నా ఎక్కువ కాఫీలు, టీలు తాగ‌కూడ‌దు. సోడా కూడ మంచిది కాదు. పండ్లు, కూర‌గాయ‌లు, చేప‌లు, ధాన్యం ఎక్కువ‌గా తీసుకోవాలి. వీలైనంత త‌క్కువ‌గా మాంసాహారం తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవ‌డం కంటే త‌క్కువ ప‌రిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. ప‌డుకునే స‌మ‌యంలో దిండు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి.

About Author