ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక న్యూస్ పేపర్ క్లిప్స్ దహనం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ” భోగి మంటల్లో ప్రభుత్వ వైఖరి దహనం ” చేయాలని యు టి ఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ముందు గాంధీ విగ్రహం దగ్గర భోగి మంటల కార్యక్రమం జరిగింది.ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగ, ఉపాధ్యాయులను శత్రువులుగా చూస్తూ… తమకు రావలసిన బకాయిలను సైతం ప్రభుత్వం వాడుకుని… బకాయిలు అడిగినందుకు. పైగా మేము ఉద్యోగుల పక్షపాతం అని మోసపూరిత మాటలు చెబుతున్న ప్రభుత్వ వైఖరి కి నిరసనగా ఈ రోజు ఉదయం భోగి మంటల్లో ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక న్యూస్ పేపర్ క్లిప్స్ ను దహనం చేయడం జరిగింది . మాకు రావాల్సినబకాయికు ,పిఆర్సి IR 30% ప్రకటించాలని , సరెండర్ లీవులు చెల్లించాలని,APGLIC పెండింగ్స్ బకాయిలు విడుదల చేయాలని ఈ కార్యక్రమం లో యు .టి .ఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు కే సురేష్ కుమార్ , జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవికుమార్, నవీన్ పాటి, సహాధ్యక్షులు హేమంత్ కుమార్, ఆర్థిక కార్యదర్శి యెహోషువ ,హనుమన్న,CITU నాయకులు రాధాకృష్ణ, నరసింహులు, ఆనంద్ బాబు, మోహన్ ,షబ్బీర్ ,రాముడు, జయరాజ్ అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.