మండుతున్న ఎండలు.. గొంతు తడిపే అధికారులు ఎక్కడ..
1 min read– ఊసేలేని చలి వెంద్రాలు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఈ ఏడాది భానుడి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదు అవుతున్న ఏటా ప్రజల అవసరార్థం అధికారులు మండల కేంద్రంలో గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం నిత్యకృతం ఈసారి మాత్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలు సంచరించే ప్రముఖ ప్రాంతాలైన బస్టాండు దుకాణాల వద్ద కనీసం ఒక్కరు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం గమనర్హం గతంలో పంచాయతీ అధికారుల సమక్షంలో పాత పోలీస్ స్టేషన్ వద్ద ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి మూడు నాళ్ల ముచ్చటగా తూతు మంత్రంగా నిర్వహించి చేతులెత్తేశారు దీంతో పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ప్రజలు చెరుకు దుకాణాలు కూల్ డ్రింక్ షాపుల వద్ద తమ వేసవితాపాన్ని తీర్చుకుంటున్నారు అధికారులు ప్రజలను పట్టించుకోవడంలేదని సమస్యలు ఏవైనా సరే అవి తమ సమస్యలు కాదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిత్య కృత్యం అయిపోయింది జూన్ ఆఖరి వరకు భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.. స్పందిస్తారో లేక షరా మామూలేనని వదిలేస్తారో చూడాలి మరి.