పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించాలి..
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: హోళగుంద మండలంలోని ఇంగలదహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పెద్దహరివాణం పరీక్షా కేంద్రానికి విద్యార్థులకు ఈ నెల 17వ తేదీ నుండి 31వ తేదీ వరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య బరత్వాజ్ కి విద్యార్థి సంఘం నాయకులు మల్లికార్జున కేసి తిమ్మారెడ్డి యూత్ అసోసియేషన్ సభ్యులు పంపాపతి వినతిపత్రం అందజేశారు. సబ్ కలెక్టర్ డిపో మేనేజర్ స్పందించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని వారు తెలియజేశారన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.