ప్రయాణికుల కోరికపై ద్వారకాతిరుమల కొండపైకి బస్సు ఏర్పాటు
1 min read
బస్సు సర్వీస్ ని ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి,విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు
రాబోయే రోజుల్లో కొత్త స్లీపర్ కోచ్ లు,లగ్జరీ బస్సులు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు డిపో నందు ప్రయాణీకుల కోరికపై గురువారం నుండి ఏలూరు నుండి (వయా) వెంకటకృష్ణాపురం మీదుగా ద్వారకాతిరుమల కొండపైకి బస్సును ప్రారంభించడం జరిగింది.ఈ బస్సు ఉదయం8: 40 నిమిషాలకు ఏలూరు నుండి బయలుదేరి ద్వారకా తిరుమల10.10 ని .చేరుకుని తిరిగి 10.30 బయలుదేరి 12 గంటలకి ఏలూరు చేరుకుని తిరిగి మధ్యాహ్నం 1 గం. బయలుదేరి 2.30 గం.ద్వారక తిరుమల చేరుకుని 3 గంటలకు బయలుదేరి 4.30 నిమిషాలకు ఏలూరు చేరుకుంటుంది.ఈ సర్వీస్ ని ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి),ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు బడే చంటి మాట్లాడుతూ కొత్త లగ్జరీ బస్సులు,స్లీపర్ కోచ్ లు అనేక కొత్త బస్సులని తీసుకురావడం జరిగిందని ప్రజలకి అనుగుణంగా బస్సు సర్వీసులను నడుపుతున్నామని ఇంకా మరిన్ని సేవలందిస్తామని తెలియజేశారు. జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయాణికులకు అనుకూలంగా కొత్త కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నామని ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఈ సర్వీస్ ని మరలా పునరుద్దించామని ఇంకా ప్రయాణికుల అవసరాలకి అనుగుణంగా మరిన్ని సర్వీసులు నడుపుతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ బి.వాణి,ఏఎంటి జి.మురళి, ఎంఎఫ్ ఐ.ప్రేమ్ కుమార్,బస్టాండ్ ఇంచార్జ్ కుమారి,పిఆర్ఓ నరసింహం,కార్మిక సంఘాల నాయకులు,అనేక మంది కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.