మహానంది క్షేత్రంలో భక్తులకు బస్టాండ్ కరువు…
1 min readఅయినా హెలిపాడ్ నిర్మాణానికి ప్రయత్నాలు.. అడ్డుకట్ట పడేనా..
పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలో భక్తులకు కావాల్సిన ఒక బస్టాండ్ కరువైంది.. అయినా కూడా మహానంది క్షేత్రంలో హెలిపాడ్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. దీనికి అడ్డుకట్టపడేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆలయ అభివృద్ధిని ఎవరు అడ్డుకోరు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డదారులు తొక్కితే వారినే మనాలి అనే చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలం నుంచి లింగం గుంట్ల జయరాం నాయుడు అడ్డదారిలో ప్రయత్నిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. గురువారం మహానంది దేవస్థానం ఉద్యోగ సంఘాలు, దేవస్థానం మాజీ పాలకమండలి అధ్యక్షులు , మహానంది గ్రామస్థుల ఆధ్వర్యంలో దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే మహానంది క్షేత్రంలోని పెద్దనంది సమీపంలో హెలీ ప్యాడ్ నిర్మిస్తే ఆలయ భూమికి నష్టం జరగడమే కాక మహాశివరాత్రి, ఉగాది ,కార్తీక మాసం, తదితర పర్వదిన సందర్భాలలో సాధారణ భక్తులకు సంబంధించిన వాహనాల పార్కింగ్, ఇతర సమస్య లు తలెత్తే అవకాశం ఉందని హెలిపాడ్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసినట్లు సమాచారం. వివిఐపీల కొరకు లేదా భక్తుల సౌకర్యం కొరకు మాత్రం హెలిపాడ్ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరగడం లేదని కేవలం ఒకబడా నేత భూమి మహానంది క్షేత్రంలోని పెద్ద నంది సమీపంలో ప్రస్తుతం వాహనాల పార్కింగ్ కొరకు వినియోగిస్తున్న స్థలాన్ని అనుకొని ఉందని. కానీ ప్రస్తుతం ఆ స్థలానికి ఎటు కూడా దారి లేదు. కేవలం ప్రస్తుతం పార్కింగ్ కోసం వినియోగిస్తున్న ఆలయ భూమి నుండి మాత్రమే రాకపోకలు జరపాల్సి ఉంటుంది. ఆలయ భూమిలో హెలిపాడ్ నిర్మిస్తే తమ స్థలాలతోపాటు ఇతర భూములకు కూడా విలువ వస్తుందని భావిస్తూ హెలిప్యాడ్ నిర్మాణానికి బడా బాబు తెర లేపినట్లు తెలుస్తుంది. మహానంది క్షేత్రంలో భక్తులకు కనీస మౌలిక వసతులు కరువు అయ్యాయని కనీసం బస్టాండ్ సౌకర్యం కూడా లేదని వీటిని కల్పించాలని కోరుతూ ఆలయ ఉద్యోగ సంఘం లతోపాటు మాజీ పాలక మండలి సభ్యులు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి వినతి పత్రాన్ని గురువారం అందజేసినట్లు తెలుస్తుంది. హెలిప్యాడ్ నిర్మాణం వల్ల భక్తులకు ఉపయోగం లేదని ఆగమ శాస్త్రానికి ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆలయ ప్రధాన రాజగోపురం కంటే ఎత్తు భాగంలో ఎలాంటి లోహవిహంగాలు తిరగడానికి వీలులేదని సూచించినట్లు సమాచారం. గతంలో కూడా పెద్ద నంది ముందు భాగంలో ఉన్న ఆలయానికి చెందిన భూమిలో ఒకసారి ఒక సామాజిక వర్గానికి చెందిన సత్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. రెండవ సారి యూనిసెఫ్ పేరుతో అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. మూడవ సారి ఏషియన్ పసిఫిక్ రీజియన్ పేరుతో హెలి ప్యాడ్ నిర్మాణానికి ఒత్తిడి తీసుకొని వస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 15 సంవత్సరాలు నుంచి వివిధ రకాల నిర్మాణాల పేరుతో ఆలయ భూమిలో చేపట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు దేవాదాయ కమిషనర్ దృష్టికి ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తీసుకుపోయినట్లు సమాచారం.