ఓర్వకల్లు విమానాశ్రయానికి బస్సు ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్; ఓర్వకల్లు: ఉయ్యాలవాడనరసింహారెడ్డి ఎయిర్ పోర్ట్ ప్రయాణికుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ 40 సీట్లు కలిగిన ఏసీ బస్సు సర్వీసును నడుపుతోంది. కర్నూలు ఆర్ఎం వెంకటరామం శుక్రవారం ఉదయం 8 గంటలకు కర్నూలు బస్టాండ్ నుంచి ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు వెళ్లే బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీరు రవిశంకర్ గారు, కర్నూలు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజరు పద్మావతి దేవి , కర్నూలు-1 డిపో మేనేజరు శ్రీనివాసులు , కర్నూలు-1 డిపో అసిస్టెంట్ మేనేజరు (ట్రాఫిక్) శ్రీ నాగభూపాల్ , ఇతర ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ఉదయం 10.30 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం (ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం) నుండి కర్నూలుకు బయలుదేరిన ఇంద్ర ఏ.సి. సర్వీసును ఎయిర్ పోర్ట్ డైరక్టరు శ్రీ కైలాష్ మండల్ గారు, కర్నూలు ఆర్టీసీ ప్రాంతీయ అధికారి శ్రీ టేకి వెంకటరామం గారు సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు.
ప్రయాణికుల భద్రత : విమానంలో బెంగళూరు నుండి కర్నూలుకు వచ్చిన ప్రయాణీకులు 11 మంది బస్సులో ఓర్వకల్లు విమానాశ్రయం నుండి కర్నూలుకు ప్రయాణించారు. అధిక మొత్తం వెచ్చించి భద్రతలేని ప్రైవేటు వాహానాలలో ప్రయాణించే బాధ తప్పించి, కనీస చార్జీలతో ఇంద్ర ఏ.సి. బస్సును ఏర్పాటు చేసి, ప్రయాణీకులకు సౌకర్యంతవంతమైన, భద్రత కలిగిన ప్రయాణాన్ని కల్పించిన ఆర్టీసీ అధికారులకు విమాన ప్రయాణీకులు కృతజ్ఞతలు తెలియజేశారు.