రవీంద్ర గ్లోబల్ స్కూల్లో వ్యాపార నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమం
1 min read
న్యూస్ నేడు కర్నూలు: స్థానిక కర్నూలు నగరంలోని పడిదంపాడు రోడ్డులోని రవీంద్ర గ్లోబల్ స్కూల్ లో “లిటిల్ సిఇఒస్ – ఆర్జెఎస్‌కోడ్‌ప్రెన్యూర్” ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం చిన్నారులలో వ్యాపార నైపుణ్యాలు, నాయకత్వం మరియు సృజనాత్మకతను పెంచడంలో ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చింది. రవీంద్ర గ్లోబల్ స్కూల్ చైర్మన్ జి వంశీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎం.గీతాశ్రీ విచ్చేశారు. వీరు తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో 25 సంవత్సరాల అనుభవంగల వీరు ఎం ఎస్ ఎం ఇ పనితీరును మెరుగుపరచడంలో గొప్ప నిపుణులు.ఈ సందర్భంగా శ్రీమతి ఎం. గీత శ్రీ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వారిని సరైన మార్గంలో నడిపితే వారి ముందు జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుందన్నారు. చిన్న వయసులోనే విద్యార్థులకు వ్యాపార నైపుణ్యాలు నేర్పితే భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ,డాక్టర్ అనే పదాలు కాకుండా వీరే పదిమందికి ఉద్యోగము ఇచ్చే స్థాయికి చేరవచ్చన్నారు .ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవీంద్ర గ్లోబల్ స్కూల్ యాజమాన్యాన్ని వీరు అభినందించారు. అనంతరం రవీంద్ర గ్లోబల్ స్కూల్ ఛైర్మన్ జి. వంశీధర్ మాట్లాడుతూ రాబోయే కాలంలో ఈ చిన్నారులు సొంత ఆలోచనలతో వివిధ రకాల వ్యాపారాలకు అంకురార్పణ గావించి గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ కార్యక్రమం బలమైన పునాది వేస్తుంది అన్నారు. తల్లిదండ్రుల సహకారంతో మా విద్యార్థులకు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ, విద్యార్థుల మేధో మదనానికి నిరంతరం కృషి చేస్తామన్నారు .ఈ కార్యక్రమంలోపాఠశాల సీఈవో శ్రీమతి జి. సుప్రియ , ప్రిన్సిపల్ ముంతాజ్ బేగం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
