శ్రీ శైలం లోని వ్యాపార సమదాయలను అన్యమతస్థుల నుండి విడిపించాలి..
1 min read
విశ్వ హిందు పరిషత్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్…
పల్లెవెలుగు కర్నూలు: మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీ శ్రీశైల శివభక్త (అన్నదానం) సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద గల శ్రీశైల సత్రం నుండి కొండి రెడ్డి బురుజు వరకు వందలాది శివ స్వాములు ర్యాలి నిర్వహించారు, ముఖ్య అతిథిగా హాజరైన విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ మాట్లాడుతూ….శ్రీశైల మహా క్షేత్రం లో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఈ శుభ సందర్భంలో మండల దీక్షతో …ఎంతో పవిత్రంగా “ఇరుముడి” సమర్పించడానికి వచ్చిన శివ స్వాముల పై నిర్దాక్షిణ్యంగా “లాఠీ ఛార్జి” చేయించిన సంబంధిత పోలీసు అధికారి,మరియు పోలీసులను వెంఠనే సస్పెండ్ చేసి,శాఖాపరమైన చర్యలతో పాటు విచారించి కఠినంగా శిక్షించాలని శ్రీశైలశివదీక్షా (అన్నదానం) కమిటి మరియు విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖడిమాండ్ చేస్తున్నదని అన్నారు. సమితి అధ్యక్షులు గోవిందరాజులు మాట్లాడుతూ…. అన్యమతస్థుడైన ( ముస్లిం) వ్యాపారి హిందూ పూజావిధానాలపై ఎటువంటి నమ్మకం లేని సదరు వ్యాపారి వస్తువు కొనుగోలుకోసం వచ్చిన స్వామితో కోనుగోలు పై బేధాభిప్రాయం వస్తే శివస్వామి అన్న గౌరవం కూడా లేక చెప్పడానికి , రాయడానికి అలవికాని బూతులు తిడుతూ “తనచెప్పుతో” శివ స్వామి పై నిర్దాక్షిణ్యంగా దాడి చేయడంతో కోపోద్రిక్తులైన శివస్వాములు సదరు వ్యాపార సంస్థపై దాడి చేయడంతో సంయమనం పాటించి వారిని వారించాల్సిన పోలీసులు ఎటువంటి హెచ్చరికలు లేకుండా “లాఠీఛార్జి” చేశారనీ శివస్వాములపై ఈ దాడిని హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నదని ఈ విషయం పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.తగిన చర్యలు తీసుకోని ఎడల లక్షలాది మంది శివ స్వాములతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా సహకార్యదర్శి గూడూరు గిరిబాబు, రామకృష్ణ,బాబూరావు,సత్యనారాయణ,రవిప్రకాష్ గౌడ్,శినాగరాజు,చంద్రశేఖర్, ప్రసాద్, సురేంద్ర,కాల్వ బుగ్గ శ్రీనివాసులుమరియూ శివ స్వాములు తదితరులు పాల్గొన్నారు.