PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘చేనేత’ గడ్డ..‘బుట్టా’ అడ్డా..!

1 min read

ఎమ్మిగనూరులో ఫ్యాన్​ జోరు…

  • ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్న బుట్టారేణుక
  • కార్యకర్తలు…. నాయకుల్లో ఫుల్​ జోష్​..
  • పద్మశాలీ ఆడబిడ్డ వచ్చిందంటూ… బొట్టు పెట్టి..హారతి ఇస్తున్న మహిళలు
  • ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, రుద్ర గౌడ్​ సహకారంతో గెలుపు ఖాయం…
  • ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తా….
  • పథకాలు అందేలా చూస్తా…
  • ‘బుట్టా’ఫౌండేషన్​తో సేవలు కొనసాగిస్తా…
  • ఆదరించి… ఆశీర్వదించండి…
  • వైసీపీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక

కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు రాజకీయం…రసవత్తరంగా మారింది. అధికార వైసీపీ అభ్యర్థి పద్మశాలీ ఆడబిడ్డ బుట్టారేణుక బరిలో నిలబడగా… ( బీజేపీ–జనసేన– టీడీపీ) కూటమి అభ్యర్థిగా జయనాగేశ్వర రెడ్డికి టిక్కెట్​ ఖరారు అయింది. ఈ క్రమంలో ఇద్దరి అభ్యర్థుల మధ్య బలమైన పోటీ నెలకొంది. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, సీనియర్​ నాయకులు రుద్రగౌడ్​ సహకారంతో ఎమ్మిగనూరులో వైసీపీ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక. 

ఎమ్మిగనూరు, పల్లెవెలుగు:సార్వత్రిక ఎన్నికల కోడ్​ సమీపిస్తున్న తరుణంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఫ్యాన్​ జోరందుకుంది. పట్టణంతోపాటు గోనెగండ్ల, నాగలదిన్నె, నందవరం, ఎమ్మిగనూరు రూరల్​లో అధికార వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి , సీనియర్​ నాయకులు రుద్రగౌడ్​ సహకారంతో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.

ప్రచారంలో…విశేష ప్రజాదరణ..:

టిక్కెట్​ ఖరారు అయినప్పటి నుంచి వైసీపీ అభ్యర్థి బుట్టారేణుక…నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ …. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతుందా… లేదా… అని ఇంటింటికి వెళ్లి ఆరా తీసి… ప్రజా మన్ననలు పొందుతోంది. రోడ్లు, కాల్వలు, వీధిలైట్లు, తదితర అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని స్పష్టమైన హామీ ఇస్తోంది. ఇంటింటికి ప్రచారానికి వెళ్లిన బుట్టారేణుకకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆదరిస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ ఆమె నుదుట బొట్టుపెట్టి.. హారతి ఇచ్చి.. స్వాగతిస్తున్నారు. తమ ఇంటి ఆడబిడ్డ వచ్చిందంటూ… అప్యాయతతో పలకరిస్తున్నారు.

కార్యకర్తల్లో…జోష్​…:

2014లో వైసీపీ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన బుట్టారేణుక… ఈ సారి చేనేతపురి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలవడంతో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంతోపాటు… అప్పట్లో సమస్య పై వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించి… దగ్గరుండి సమస్యను పరిష్కరించడంలో సఫలమైంది. ఆ గుర్తింపు ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట విశేష ప్రజాదరణ చూసిన కార్యకర్తలు, నాయకులు ఫుల్​ జోష్​లో ఉన్నారు.

బుట్టా ఫౌండేషన్​ …సేవ..:

ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే బుట్టాఫౌండేషన్​ నేతృత్వంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు కంప్యూటర్లు, పుస్తకాలు, మహిళలకు కుట్టుమిషన్లు, అనాథలకు దుస్తులు, అన్నదానం తదితర కార్యక్రమాలు అనేకం చేశారు. ఇప్పటికీ బుట్టా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ బుట్టా ఫౌండేషన్​ ద్వారా సేవ చేస్తూ… ప్రజాదరణ పొందుతున్న ఏకైక వీరవనిత శ్రీమతి బుట్టారేణుకగా చెప్పవచ్చు.

పోటా…పోటీ…:

విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు ఉన్న ఎమ్మిగనూరులో  ఫ్యాన్​ హవా కొనసాగుతూనే ఉంది. టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డిని ఢీకొట్టే సత్తా ఉన్న ఏకైక మహిళ బుట్టారేణుక మాత్రమేనని ప్రజలు బహిరంగంగానే చర్చించు కుంటున్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి , సీనియర్​ నాయకులు రుద్రగౌడ్​ సహకారంతో తన గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న బుట్టారేణుక… అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. అప్పుడు ప్రభుత్వ పథకాల కొనసాగింపుతోపాటు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని హామీ ఇచ్చారు.

సీఎం జగన్​కు… గిఫ్ట్​…:

ఎమ్మిగనూరులో వైసీపీ జెండా ఎగరవేసి… సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికి గిఫ్ట్​గా అందజేస్తానని ధీమా వ్యక్తం చేశారు బుట్టారేణుక. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి… సేవ చేస్తానని.. ఆదరించి.. ఆశీర్వదించాలని కోరారు.  రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. ప్రజలకు, రైతులకు, విద్యావంతులు, మేధావులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు దగ్గరుండి సేవ చేస్తానన్నారు.

About Author