NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

3వేల మంది భక్తులకు మజ్జిగ, మంచినీరు, పులిహోర, చక్రపొలి అందజేత

1 min read

గత9 సం:లుగా ప్రసాద వితరణ,దిగ్విజయంగా 10వ సంవత్సరంలో..

ఇండిగా ట్రావెల్స్ అధినేత ఇండిగా రాజుకి పలువురు భక్తులు ఆశీస్సులు

ఏలూరు ప్రతినిధి న్యూస్​ నేడు  : మహాశివరాత్రి సందర్భంగా బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తులకు గత 9 సంవత్సరాల నుండి చల్లటి మజ్జిగ, మంచినీరు, వేడివేడి పులిహోర, చక్కర పొంగలి వేలాది మంది భక్తులకు ఇండిగా ట్రావెల్స్ అధినేత ఇండిగా రాజు ప్రసాద వితరణ చేస్తున్నారు. బుధవారం మహాశివరాత్రి పర్వదిన పురస్కరించుకొని స్థానిక కండ్రిగూడెం ఏరియాలో మహా శివుని ప్రతిమలనుతో టెంట్ వేసి సుమారు 3000 మంది భక్తులకు మజ్జిగ ,మంచినీరు, చక్ర పొంగలి, పులిహోర ట్రావెల్స్ సిబ్బందితో అందజేశారు. వేలాది మంది భక్తులు కాస్త విశ్రమించి, మజ్జిగ మంచినీరు తీసుకొని ఇంతటి బృహత్వమైన కార్యక్రమం చేపట్టిన ఇండిగా ట్రావెల్స్ అధినేతకు ఆ దైవ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వ్యాపార అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

About Author