హిందువుల వద్దే పండ్లు కొనండి !
1 min readపల్లెవెలుగువెబ్ : పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యానికి ముగింపు పలకాలని కర్ణాటక హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యం చలాయిస్తున్నందున ఎక్కువ మంది హిందువులు ఇందులో భాగస్వాములు కావాలని హిందూ జనజాగృతి సమితి కోఆర్డినేటర్ చంద్రు మోగేర్ కోరారు. హిందువులంతా హిందూ విక్రేతల నుంచి పండ్లను కొనుగోలు చేయాలని మోగేర్ ట్విట్టరులో కోరారు. ‘‘పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలని హిందువులను అభ్యర్థిస్తున్నాను’’ అని మోగేర్ కోరారు.