ఒక్క రూపాయితో కూడ బంగారం కొనొచ్చు !
1 min readపల్లెవెలుగు వెబ్ : బంగారం కొనాలంటే కనీసం 10 వేలైనా ఉండాలి. లేకుంటే ఇప్పుడు ఉన్న ధరల్లో బంగారం కొనడం సాధ్యం కాదు. కానీ డిజిటల్ గోల్డ్ తో ఒక్క రూపాయితో కూడ బంగారం కొనుగోలు చేయవచ్చు. ఈ డిజిటల్ గోల్డ్ 100 శాతం స్వచ్చమైనది. నకిలీ అనే మాటకు ఇక్కడ తావుండదు. ఈ బంగారం ధరలు పూర్తీగా అంతర్జాతీయ మార్కెట్ తో అనుసంధానమై ఉంటాయి. మన తరపున విక్రయించే వారే బంగారాన్ని కొని సురక్షితంగా ఉంచుతారు. ఈ బంగారానికి బీమా సౌకర్యం కూడ ఉంటుంది. ఈ కొనుగోలుకు జీఎస్టీ కూడ చెల్లించాల్సి ఉంటుంది. మన కావాలంటే ఆన్ లైన్ లోనే గోల్డ్ అమ్ముకోవచ్చు. లేదా లోహరూపంలో తీసుకోవచ్చు. మనకు ఆన్ లైన్ రుణాలు కావాలంటే ఈ డిజిటల్ గోల్డ్ ను తనఖా పెట్టొచ్చు. దీంతో డిజిటిల్ గోల్డ్ ప్రాచుర్యంలోకి వచ్చింది.