PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ రెండు రాష్ట్రాల్లో రేపటినుంచే ఖరీఫ్​ పంట కొనుగోలు! దిగొచ్చిన కేంద్రం

1 min read

పల్లెవెలుగువెబ్​, ఢిల్లీ: పంజాబ్​, హర్యానా రాష్ట్రాల్లో ఖరీప్​ పంట కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలన్న రైతుల డిమాండ్​ను కేంద్రం దిగొచ్చింది. ఈమేరకు ఆదివారం నుంచే ఖరీప్​ పంట కోనుగోళ్లను చేపడతామని కేంద్రప్రపభుత్వం ప్రకటించింది. కాగా కేంద్రం ప్రవేశపెట్టిన మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటే దేశరాజధాని సరిహద్దుల్లో 10నెలలుగా పంజాబ్​, హర్యానా రాష్ట్రాల అన్నదాతలు ఆందోళన చేపడుతోన్న విషయం తెలిసిందే. మొదట ఖరీఫ్​ పంట కొనుగోళ్ల ప్రక్రియను అక్టోబర్​ 11నుంచి నిర్వహించాలని నిర్ణయించిన కేంద్రం… రైతుల తీవ్ర ఒత్తిడి తీసుకరావడంతో శనివారం కేంద్ర వ్యవసాయ మంతృత్వ శాఖ సమీక్ష నిర్వహించి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వెల్లడిస్తూ ఖరీఫ్​ పంట కొనుగోళ్లను 3వ తేదీ నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది.

About Author