PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్త ఇల్లు క‌ట్టుకుంటున్నారా.. బ‌జాజ్ ఫైనాన్స్ స‌రికొత్త ఆఫ‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ‌జాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స‌రికొత్త ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. అధిక క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న కస్టమర్లకు 6.65 శాతం వడ్డీకే ఇంటిరుణం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందుకోసం సిబిల్‌ స్కోర్‌ కనీసం 800 ఉండాలన్న ఆంక్ష విధించింది. అలాగే 750 నుంచి 799 మధ్యన స్కోర్‌ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకుంటే కాస్తంత ఎక్కువ వడ్డీరేటుకు రుణం ఇవ్వనున్నట్టు వెల్లడించింది. దీనికి తోడు అర్హులైన కస్టమర్లు తమ హోమ్‌లోన్‌ రేటును ఆర్‌బీఐ రెపోరేటుతో అనుసంధానం చేసుకునే అవకాశం కల్పిస్తున్నామంటూ దేశంలో ఒక హెచ్‌ఎ్‌ఫసీ కస్టమర్లకు ఇలాంటి అవకాశం ఇవ్వడం ఇదే ప్రథమమని తెలిపింది. దీని వల్ల ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించినప్పుడల్లా ఇంటి రుణంపై వడ్డీ ఆటోమేటిగ్గా తగ్గుతుందని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది.

                                     

About Author