NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపఎన్నిక కౌంటింగ్.. భారీ మెజార్టీలో వైసీపీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఉపఎన్నిక కౌంటింగ్ కొన‌సాగుతోంది. తొలిరౌండ్‌లోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డికి 5,337వేల ఓట్ల మెజార్టీ లభించింది. మేకపాటి విక్రమ్‌రెడ్డికి 6 వేలకు పైగా ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌కు 700 పైచిలుకు ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌ పూర్తయ్యే సరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 10వేలకు పైగా మెజారిటీ. మూడో రౌండ్‌లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్న విక్రమ్‌రెడ్డి. . మూడో రౌండ్‌ పూర్తయ్యే సరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 12, 864 ఓట్ల మెజారిటీ సాధించి భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. నాల్గో రౌండ్‌ పూర్తయ్యే సరికి 17వేలకు పైగా ఆధిక్యంలో మేకపాటి విక్రమ్‌రెడ్డి ఉన్నారు. ఐదో రౌండ్‌ పూర్తయ్య సరికి వైఎస్సార్‌సీపీకి 21, 241 ఓట్ల మెజారిటీ వ‌చ్చింది. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి ఐదో రౌండ్‌లోనూ హవా కొనసాగించారు.

                                          

About Author