NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయ‌ల‌సీమ‌ను మ‌రిచిపోయిన సీఎం జ‌గ‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సీఎం జ‌గ‌న్ రాయ‌ల‌సీమ గొంతు కోస్తున్నార‌ని టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యులు కాల్వ శ్రీనివాసులు మండిప‌డ్డారు. ఈ ప్రాంతానికి సాగునీటి వ‌స‌తి క‌ల్పించే ప్రాజెక్టులు ప‌క్కన‌పెట్టార‌ని విమ‌ర్శించారు. జీవోలు, ప్రక‌ట‌న‌ల పేరుతో ఊరించ‌డం తప్ప రాయ‌ల‌సీమ‌కు చేసిన మేలు ఒక్కటీ లేద‌ని దుయ్యబ‌ట్టారు. చంద్రబాబు ప్రభుత్వం 62 ప్రాజెక్టులు చేపట్టి.. వాటిలో 23 పూర్తీ చేసింద‌ని, వాటి కోసం 65 వేల‌కోట్లు ఖర్చు చేసింద‌ని చెప్పారు. ఈ రెండేళ్లలో ఏడాదికి 1000 కోట్లు కూడ జ‌గ‌న్ ప్రభుత్వం ఖ‌ర్చు చేయ‌లేద‌ని తెలిపారు. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తీ కావ‌డానికి 30 ఏళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.

About Author