NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రివ‌ర్గ తుది జాబితా విడుద‌ల !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ మంత్రివర్గ తుది జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 25 మందికి చోటు కల్పించారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పును సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే నూతన మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు వెళ్లింది. సీఎం పేషీ నుంచి కొత్త మంత్రులకు ఫోన్‌లు వెళ్లాయి. ఫోన్‌ రావడంతో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ విజయవాడ బయల్దేరారు. కొత్త, పాత మంత్రులకు సీఎం పేషీ నుంచి ఫోన్‌లు వెళ్లాయి. మరికొందరికి జీఏడీ నుంచి ఫోన్‌లు వచ్చాయి. సోమవారం ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

  • శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు
  • విజయనగరం నుంచి బొత్స, రాజన్నదొరలకు చోటు
  • విశాఖ నుంచి గుడివాడ అమర్నాథ్‌, ముత్యాలనాయుడు
  • తూ.గో. నుంచి దాడిశెట్టిరాజా, విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
  • ప.గో. నుంచి తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ
  • చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి
  • ఆర్కే రోజా, జోగి రమేష్‌, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున
  • విడదల రజనీ, కాకాని గోవర్ధన్‌రెడ్డి, అంజాద్ బాషా
  • క‌ర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం
  • అనంత‌పురం నుంచి ఉషా శ్రీచరణ్‌, తిప్పేస్వామి
                                

About Author