ఆలయం హుండీ లెక్కింపు.. పెరిగిన ఆదాయం
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మూల పెద్దమ్మ జాతర సందర్భంగా గత నెలను రోజుల నుండి భక్తులు అమ్మవారికి వేసిన కానుకలను బుధవారం నాడు శాశ్వత హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఆవరణలో ఆలయ అధికారులు చైర్మన్ ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు గత సంవత్సరం కంటే 1,50,000 9.32 రూపాయల ఆదయం పెరిగినట్టు ఈ సంవత్సరం నాలుగు లక్షల 57 వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు అమ్మవారికి భక్తులు సమర్పించినట్టు ఆలయ పర్యవేక్షణ అధికారి నాగప్రసాద్ దేవస్థానం ఈవో ఎస్ మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తలారి చిన్నన్న. కమిటీ సభ్యులు గువ్వల కేశవరావు. వాల్మీకి సేవ కమిటీ సభ్యులు ఏపీజీబీ బ్యాంక్ సిబ్బంది నంద్యాల తిరుమల బాలాజీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.