ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్
1 min read– పట్టభద్రుల శాసనసభ ఎన్నికలు 81.71శాతం పోలింగ్ నమోదు
– ఉపాధ్యాయ శాసనసభ ఎన్నికలు 100శాతం
– సిఐ శ్రీరాములు అధ్వర్యంలో ప్యాపిలి ,జలదుర్గం ఎస్ ఐలు శాంతి భధ్రతలపై ప్రత్యేక నిఘ
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: మండల కేంద్రమైన ప్యాపిలి లో ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఈసందర్భంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం ఉదయం నుంచి ఉపుఅందుకుని అనంతరం ఓటర్లు బారులు తీరారు. మండలంలో 1438పట్టభద్రుల ఓటర్లు వుండాగ అందులో 1175 మంది ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటును వినియోగించుకున్నారు,అందులో 263మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకొలేదు.స్థానిక బాలుర పాఠశాల లో రెండు పోలింగ్ కేంద్ర 1016మందికి గాను 824మంది తమ ఓటును నమోదు చేసుకున్నారు. 192మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకొలేదు. అలాగే జలదుర్గం పోలింగ్ కేంద్రం లో 422మంది గాను 351మంది ఓటును నమోదు చేసుకున్నారు. 71 ఓటుహక్కు ను వినియోగించుకొలేదు.ఉపాధ్యయ శాసనసభ మండలి 25 మంది కి 25మంది ఓటు హక్కు ను వినియోగించుకుని 100శాతం నమోదు చేసుకున్నారు.పోలింగ్ కేంద్రం వద్ద సిఐ శ్రీరాములు ,ప్యాపిలి ,జలదుర్గం ఎస్ఐలు తమ పోలీసుల సిబ్బంది ఎలాంటి అవచికలు సంఘటన లు చోటు చేసుకూడా శాంతి భధ్రతలపై ప్రత్యేక చర్యలు తిసుకున్నారు. మొత్తానికి ప్యాపిలి లో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాతంగా ముగిసింది.